శ్రావణమాస బోనాల సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం

August 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి బస్‌స్టాప్‌ వద్ద ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాస బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం మరియు బోనాల పండుగ ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుని శాలువాతో ఘనంగా సన్మానించి, అమ్మవారి ప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper