సారంపల్లి మల్లారెడ్డి కి నివాళి అర్పించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
జనం న్యూస్ హైదరాబాద్:25-08-2026 రైతు ఉద్యమ జాతీయ నాయకుడు ,అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు, సీపీఎం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నిన్న అనారోగ్యంతో మరణించగా హైదరాబాద్ లోని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించిన నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మల్లారెడ్డి జీవితాంతం రైతుల పక్షాన నిలిచి పోరాటం చేశారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.