అల్లీపూర్ గ్రామంలో ఘనంగా వన మహోత్సవం
జనం న్యూస్ 25-08-2026 చిన్నకోడూరు మండలం, అల్లీపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అల్లీపూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీమతి కుంబాల మణెమ్మ–లాలయ్య గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్, డైరెక్టర్లు, అధికారులు MPDO, MPO, APO, గ్రామ యువత మరియు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచాలని పిలుపునిచ్చారు. అల్లీపూర్ గ్రామాన్ని పచ్చదనంతో నిండిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.“మొక్క నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం – భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం” అనే సందేశంతో వన మహోత్సవం కార్యక్రమం కొనసాగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.