31న నగర సంకీర్తన

May 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం : జహీరాబాద్, మే 28: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 31 న ఆదివారం ఉదయం 6-15 గంటలకు పట్టణంలోని విద్యుత్ కాలనీ గణేష్ మందిరం లో 209 వ నగర సంకీర్తన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ బాధ్యులు తెలిపారు. హరేకృష్ణ మహామంత్ర జపం, ప్రభుపాదుల వారి ప్రార్థన, వైష్ణవ కీర్తనలతో శోభాయాత్ర, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభిషణ్ దాస ప్రభుజీ ద్వారా భగవద్గీత శ్లోకాలపై ప్రవచనం, నరసింహ ఆరతి ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు సాంప్రదాయ వస్త్రధారణ లో వచ్చి ఈ సంకీర్తన కార్యక్రమం లో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

🌐 Select Language:
📰 ePaper