వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 ఘన విజేతలకు బహుమతుల

May 26, 2026 | తెలంగాణ

ప్రదానం క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం – మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు

జనం న్యూస్ మే 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌వీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్–2026 పోటీలు విజయవంతంగా ముగిశాయి. అన్ని వయో విభాగాల క్రీడాకారులు ఉత్సాహం గా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్, కార్యదర్శి యు.వి.ఎన్. బాబు, కోశాధికారి పీ.వి.ఎల్. కుమార్, ఏ.వి. రమణారెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయంత్‌తో పాటు ఎస్‌ఎల్‌వీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వాహకులు కె. జయంత్, ఎం. మోహన్ రెడ్డి, జి.సి.ఆర్. రెడ్డి, ఎం. రామరాజు, వై. సాయి తేజ, నవీన్ వర్మ, వెంకట్, కిరణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్రీడాకారులు విజయం–పరాజయాలను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమిని నిరాశగా కాకుండా పాఠంగా తీసుకుని, ప్రతిరోజూ కష్టపడి సాధన చేస్తే విజయాలు తప్పక సాధించవచ్చని అన్నారు. క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఆడుకోవడానికి తగిన స్థలాలు లేకుండా పోతున్నాయని, పాఠశాలలు అధికంగా వాణిజ్య ధోరణిలో నడుస్తుండటంతో పిల్లలకు క్రీడల అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులను ప్రోత్సహించే సంస్థలు, నిర్వాహకులను అభినందించారు.ప్రభుత్వాలు కూడా క్రీడాకారులకు మరింత సహాయ సహకారాలు అందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత క్రీడల వైపు మళ్లి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన కైవల్య అండర్-19 విభాగంలో ఛాంపియన్‌గా, అనేకళ్ల భావేష్ రెడ్డి జిల్లా అండర్-17 ఛాంపియన్‌గా, అద్వైత్ సత్తు జిల్లా అండర్-15 ఛాంపియన్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.కార్యక్రమం అనంతరం విజేతలు, క్రీడాకారులు, నిర్వాహకులతో కలిసి అతిథులు స్మారక చిత్రాలు దిగారు. వికారాబాద్ జిల్లాలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఈ పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper