ధాన్యాన్ని మరియు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మాజీ ఎంపీపీ అరవింద్ రావు.
జనం న్యూస్( పరిగి నియోజకవర్గ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి) మే 27,వికారాబాద్ జిల్లా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే దానిని అమలు చేయాలి. ప్రభుత్వం తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారని, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత రాత్రి పరిగి లో పడిన వర్షం వల్ల చాలా ధాన్యం తడిసిపోయిందని ఇకనైనా రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని బీఆరెస్ నాయకులు తెలియజేశారుతడిచిన ధాన్యాన్ని పరిశీలించిన నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మరియు అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని బయటకు చెబుతున్న పరిగిలో ఇప్పటివరకు కేవలం 10 శాతం మాత్రమే కొనుగోలు చేశారని కొనుగోలు సెంటర్లు కేవలం ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితం అయ్యాయని అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.ఇకనైనా ప్రభుత్వం రైతుల వద్ద వెంటనే తడిచిన ధాన్యంతో సహా పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేనిపక్షంలో బీఆరెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోమాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అశోక్ రెడ్డి, సర్పంచులు మాణిక్యం, రామచంద్రయ్య, కౌన్సిలర్లు జాక్ రవికుమార్, తాహెర్ అలీ, ఆనెం ఆంజనేయులు, నరేష్ యాదవ్, నాయకులు జంగయ్య, సేవియా నాయక్, తదితరులు పాల్గొన్నారు