ఆనాటి బావులే, బాగుండే

May 28, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, 2026 మే 28 కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కొల్లూరు గ్రామానికి, గత ప్రభూత్వం, మిషన్ భగీరథ పథకం ద్వారా, ఈ గ్రామానికి మంచి నీటి సరఫరా చేయలేక పోవడంతో, ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభూత్వ హయాంలో త్రవ్వించిన, వాటర్ షెడ్ బావిలోని నీటినే, నీళ్ల ట్యాంకులలో నిల్వ చేసి, ఇంటింటికి నల్లాల ద్వారా, ఈ నాటికి సరఫరా చేస్తున్నారు. వేసవికాలం రావడంతో, వాటర్ షెడ్ బావిలోని నీళ్ళు తగ్గిపోయాయి. రెండవది, గ్రామ ప్రజలందరికీ, మరియు పశువులకు, త్రాగునీటి అవసరాలు తీర్చేది, బోరు బావి, ఈ నీటిని తీసుకొని పోవుటకు వీలుగా, హనుమాన్ మందిర్ ముందు,నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. ఇక్కడినుండే గ్రామ ప్రజలందరూ త్రాగునీటిని, తీసుకొని వెళ్ళతారు. గత నాలుగు రోజులనుండి, ఈ గ్రామంలో 3 ఫ్యూస్ కరెంట్ సరఫరా చేయలేక లేకపోడంతో, ఈ గ్రామం లో త్రాగునిటీ కొరత ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై, గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . గ్రామ ప్రజల నీటి కొరతను కొంత వరకు తీర్చాలంటే, దళ్ళిత వాడలో , ఏ నాడో త్రవ్వి, రాతితో నిర్మించిన, రెండు బావులు ఇక్కడ ఉన్నాయి. ఈ బావులలోని నీటితోనే, ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ఇతర అవసరాలకు, ఈ నీటినే వాడుకున్నారు. ఎండలుముదరడంతో, ఈ బావులలోని నీళ్లు, అడుగంటాయి. కావున ప్రభూత్వ అధికారుల స్పందించి, ఈ బావులలోని పూడికను తీయించి, మరమ్మతులు చేయించినట్లయితే, గ్రామ ప్రజలకు , మరియు పశువులకు, నీటి అవసరాలు కొంతవరకు తిరుతాయని, గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి, ఈ రెండు బావులలోని, పూడికను తీయించాలని, ఈ గ్రామానికి నిరంతరయంగా కరెంట్ సరఫరా �

🌐 Select Language:
📰 ePaper