వర్తక సంఘం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక.
జనం న్యూస్ 29మే పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో గత పది రోజుల క్రితం వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వర్తక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో భాగంగా పెగడపల్లి వర్తక సంఘం ఉపాధ్యక్షుడిగా రెండవసారి పెద్ది రమేష్ ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన వర్తక సంగం కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వర్తక సంఘం సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని అన్నారు. వర్తక సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా పలువురు అభినందించడం జరిగిందని తెలిపారు.