ఫిలింనగర్ క్లబ్లో లో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ మే 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థం నిర్వహించిన “ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్” ప్రధానోత్సవం గురువారం ఫిలింనగర్ క్లబ్లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుక విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రంగంలో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఆయన చేతుల మీదుగా “ఎన్టీఆర్ లెగసీ అవార్డులు” ప్రదానం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి బండి రమేష్తో పాటు సినీ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వకారణమని, ఆయన సినీ, రాజకీయ రంగాల్లో సృష్టించిన చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కళారంగంలో విశేష ప్రతిభ కనబరిచి అవార్డులు అందుకున్న వారిని “కళామతల్లి ముద్దుబిడ్డలు”గా అభివర్ణిస్తూ అభినందన లు తెలిపారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. కార్య క్రమంలో పలువురు సినీ, రాజకీయ, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. సభ మొత్తం ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నిండిపోయి అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.