ఇందిరమ్మ ఇండ్ల అర్బన్ కాలనీలో అభివృద్ధికి మోక్షం ఎప్పుడు ?
సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి ఎక్కడ.?ఈ ప్రభుత్వం తోనైనా మాకు
అభివృద్ధి జరుగుతుందా అని ఆశతో కాలనీవాసులు
. (జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ) జనం న్యూస్, మే 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: పట్టణంలో గల వైయస్సార్ అర్బన్ కాలనీ నూతనంగా (12వ వార్డు లో ) విలీనం చేసిన వార్డులో అభివృద్ధికీ నోచుకోని వైనం. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కోరుట్ల కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కీర్తిశేషులు కొమిరెడ్డి రాములు ఆధ్వర్యంలో మంజూరు అయిన ఇల్లు సుమారుగా (800) ఎనిమిది వందలకు పైగా అక్కడ మంజూరైనవి కాగా పేద,బడుగు,బలహీన మధ్యతరగతి ప్రజలకు ఇండ్లను మంజూరు చేసిన కీర్తిశేషులు కోమిరెడ్డి రాములు. కానీ ఇప్పటివరకు అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. సరియైన నీటి సదుపాయం లేక,డ్రైనేజీ వ్యవస్థ లేక,సీసీ రోడ్లు లేక వెలిగి వెళ్ళగని వీధి దీపాలతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి స్మశాన వాటిక లకు కూడా ఇబ్బందిగా ఉందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు రోజువారీ పని నిమిత్తమే కాకుండా నిత్య అవసరాలకు రోజు దాదాపు ఆరు కిలోమీటర్ల అయినా మెట్టుపల్లి పట్టణానికి రావలసిన పరిస్థితి పని ముగించుకుని రాత్రి సమయంలో తిరుగు ప్రయాణం చేసే సమయంలో అక్కడ దారి మధ్యలో ఏపుగ పెరిగిన చెట్ల నుండి వస్తున్న పాములు. కాలనీ లోపల వెళ్లడానికి దారిలో మూలమలుపు వద్ద సూచిక బోర్డు కూడా ఇప్పటివరకు కనబడని వైనం. ఇప్పుడైనా నూతన పాలకవర్గంలో మాకు అభివృద్ధి జరుగుతుందా అని వేచి చూస్తున్నామని . 99 రోజుల “ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో ” భాగంగా ఇప్పుడైనా మా కాలనీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానిధుల నుండి నిధులను మంజూరు చేసి మాకు తగు సదుపాయాలు కల్పించగలరని కాలనీ వాసులుగా కోరుతున్నామని అన్నారు. ఇది ఇలా ఉండగా పాత ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నుండి ఎప్పుడు ఇల్లు కట్టుకోవడానికి నిధులు మంజురవుతాయని అయోమయంలో ఉన్నామని ఎండకు ఎండి వానకు తడిసి బీటలు పారిన గోడలతో సగం స్లాబ్ వరకు ఆగిపోయిన ఇల్లు చాలా వరకు ఉన్నాయని వాటికి కూడా మోక్షం ఎప్పుడు లభిస్తుందని ప్రజలువారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వార్డును సుందరీకరణగా తీర్చిదిద్దాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు .