జహీరాబాద్ రామ్‌నగర్‌లో తక్కువ ఫీజులతో మెరుగైన వైద్య సేవలు ఆర్‌ఎంపీడాక్టర్
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం మే 29. 05. 2026 రవికుమార్‌కు ప్రజల ప్రశంసలు జహీరాబాద్ పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఆర్‌ఎంపీ డాక్టర్ రవికుమార్ తక్కువ ఫీజులతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ స్థానిక ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు నిత్యం సేవ చేస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు సమయానికి చికిత్స అందిస్తూ, అవసరమైన సూచనలు ఇస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తక్కువ ఫీజులతో సేవలు అందించడం వల్ల ప్రజలు ఉపశమనం పొందుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రోగులతో సానుభూతిగా మాట్లాడటం, అవసరానికి అనుగుణంగా వైద్య సూచనలు ఇవ్వడం వల్ల డాక్టర్ రవికుమార్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. రామ్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆయన సేవలను వినియోగించుకుంటూ, అందుబాటు వైద్య సేవలందిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.