సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే విజయ్ కుమార్

ఈ నెల 30న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
జనం న్యూస్, మే 29,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.అచ్యుతాపురం మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)తో పాటు అనేక పరిశ్రమలు ఉన్నందున రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 30న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు సహకరించాలని కోరారు. ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు అందేలా అందరం ఒకే తాటిపైకి రావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.