ఉపాధి హామీ పథ కం కూలీలకు అడప శ్రీనివాస రావు ఆధ్వర్యంలో మజ్జిగ దాహం పంపిణీ
జనం న్యూస్ మే 30 (ముమ్మిడివరం ప్రతినిధి) (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజవర్గం ఈరోజు బోడసకుర్రు లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు గత వారం రోజుల నుండి చల్లటి మజ్జిగ ఎన్డీఏ నాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రోజు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మరియు కూలీలకు సంబంధించి ప్రభుత్వం నుండి కల్పిస్తున్న సౌకర్యములను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సంవత్సరము నుండి వారికి వేతనము 357 రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుందని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము 55 రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ విషయాలను వారికి తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అరవ చంటి గారు ఓలేటి పరమేశ్వరరావు దొమ్మేటి రాధాకృష్ణ ఐల నాగేశ్వరరావు ముత్యాల బాబి రొక్కల నాగేశ్వరరావు అయిల శంకరం తదితరులు పాల్గొన్నారు