అంబేద్కర్ నగర్ లో దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్న బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూన్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణకూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో ప్రతినెల పెన్షన్ 1 వ తేదీన పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు జీవీఎంసీ 80 వ వార్డ్ అంబేద్కర్ నగర్ లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవాడ రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు దివ్యాంగురాలకు 6000 వేలు రూపాయలు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ లబ్ధిదారులను పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ జూన్ నెల ఎన్టీఆర్ భరోసా నిధులు కూటమి ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ. 2,728 కోట్లు ఖర్చు చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా 62,34,445 మందికి పెన్షన్లు లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని, జూన్ నెల నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరని, స్పౌజ్ పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూ. 2.24 కోట్లు విడుదల చేశారని, కొత్త పెన్షన్ల వారికి జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేస్తారని, పెన్షన్ల కోసం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రూ. 65,886.57 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని నాగ జగదీష్ అన్నారు. అలాగే కొత్త పెన్షన్లు 15 లక్షల మందికి ఇచ్చే ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం చేస్తుందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని, పెన్షన్ రాలేదని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో 50 సంవత్సరాలు ఉన్నవారికి కూడా పెన్షన్ మంజూరు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని, త్వరలో నిబంధనలు ప్రకటిస్తారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో 80 వ వార్డ్ కస్టర్ ఇంచార్జ్ బొడ్డేడ జోగినాయుడు కర్రి మల్లేశ్వరరావు బుద్ధ మహాలక్ష్మి నాయుడు మునగపాక నరసింహారావు కే అప్పలరాజు మిడిపాటి హరి సచివాలయ సిబ్బంది మూర్తి తదితరులు పాల్గొన్నారు.//