విజయవాడ పార్టీ ఆఫీసులో బిజెపి జిల్లా కోశాధికారుల తో సమావేశం

June 2, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 2 (ముమ్మిడివరం ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారుల సమావేశం సోమవారం విజయవాడ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరిగింది. ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి ఆ పార్టీ జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ వేణి థ పర్, రాష్ట్ర బిజెపి కోశాధికారి ఎం నాగేంద్ర, సహాయ కోశాధికారి కందుకూరి సత్యనారాయణ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా బిజెపి కోశాధికారి గ్రంధి సూర్యనారాయణ గుప్త( నానాజీ )ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమునకు , అమ్మవారి దర్శనమునకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ ,జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతి వేణి థాపర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అమ్మవారి దర్శనం చేయించి , వేద పండితులచే ఆశీర్వాదాలు , ప్రసాదాలు అందచేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లి అబ్బాయి .

🌐 Select Language:
📰 ePaper