రైతన్న కోసం మహా ధర్నా నిర్వహించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ జూన్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి ;మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు ఎక్స్ రోడ్ వద్ద బి ఆర్ ఎస్ మంగళవారం ఉదయం మహాధర్నా నిర్వహించారు మెదక్ జోగిపేట్ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి రెండు గంటలు మహాధర్నా నిర్వహించారు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదని అలాగే ఆరుకాలం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయలేకపోవడం దురదృష్టకరం అని తెలియజేశారు లారీలు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆరుకాలం పండించిన పంట ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు లారీలు సమయానుకూలంగా వచ్చి వడ్లు ప్రభుత్వం అతి త్వరగా కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి తెలిపారు తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు అకౌంట్లో తొందరగా జమ చేయాలని తెలియజేశారు చండూర్ ఎక్స్ రోడ్ వద్ద భారీ ఎత్తున మహా ధర్నా నిర్వహించారు రెండు గంటలసేపు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాను కొనసాగించారు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు ధాన్యం తడిసిపోతుందని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని తెలియజేశారు టిఆర్ఎస్ హయాంలో తొందరగా వరి ధాన్యం కొనుగోలు చేసిందని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని తెలియజేశారు ఆరు కాలం పండించిన పంట వర్షం పడితే తడిసి ముద్ద అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని తొందరగా లారీలు రప్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రైతులు బి ఆర్ ఎస్ శ్రేణులు వివిధ గ్రామాల బి ఆర్ ఎస్ సర్పంచులు అధ్యక్షులు రైతులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు