నందికొండ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కౌన్సిలర్ల గైర్హాజరు
జనం న్యూస్-జూన్ 2- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మున్సిపల్ కమిషనర్ సైదులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ బడుగు మానస జాతీయ జెండాను ఎగరవేశారు, ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ అధికారిక వేడుకల్లో కొందరు కౌన్సిలర్లు పాల్గొనకపోవడం ప్రజా ప్రతినిధుల ప్రవర్తన బాధ్యతారాహిత్యం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.కౌన్సిలర్ల గైర్హాజరి– బాధ్యత ఎటు పోయింది?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కొందరు కౌన్సిలర్లు పూర్తిగా గైర్హాజరయ్యారు, ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రాముఖ్యతను కూడా గౌరవించకుండా హాజరు కావడం వారి బాధ్యతరాహిత్యానీకి అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు, కొత్తగా ఎన్నికైన కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.