తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
జనం న్యూస్ జూన్ 3 వికారాబాద్ జిల్లాపరిగి పట్టణములో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పదవి త్యాగంతో మొదలై, ప్రాణ త్యాగానికి సిద్ధమైనా తెలంగాణ అమర వీరులకు , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రథసారధి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అని, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. చరిత్రలో నిలిచి పోయిన రోజు జూన్ 02.06.2014 అని, పదవులకే రాజీనామా చేయకుంటే, ఉద్యమాన్నే ఒక్క నాయకుడై నడిపించకుంటే, ఉద్యమాన్ని ఉదృతం చేయకుంటే, చావునైనా లెక్క చేయకుంటే, తెలంగాణ వచ్చేదా అని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అమరణ నిరాహార దీక్ష చేపట్టిన గౌరవ తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ, చావు నోట్లో తల పెట్టి, తెలంగాణ రాష్ట్రన్నీ సంధించిన కరణజన్ముడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని తెలిపిన, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు సర్పంచులు మాజీ ఎంపీపీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.