టియుడబ్ల్యూ జె – ఐజేయు నూతన కార్యవర్గం ఏకగ్రీవం
అధ్యక్షుడిగా పాకాల నర్సింహా,ప్రధాన కార్యదర్శిగా టి.కె.ప్రకాష్ ఎన్నిక
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం నూతన కార్యవర్గం
జనం న్యూస్ – జూన్ 3- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాగార్జునసాగర్ పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బుధవారం నకరికల్ లో నిర్వహించిన జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ జరిగింది,నాగార్జున సాగర్ పట్టణ గౌరవ అధ్యక్షులు గా శ్రీనివాస్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డిలు,అధ్యక్షులుగా పాకాల నర్సింహా,ప్రధాన కార్యదర్శి,టి.కె.ప్రకాష్,కోశాధికారి భూపతి రవీందర్,ఉపాధ్యక్షులు గా కోడా అప్పారావు,యాళ్ల విజయ్,సహాయ కార్యదర్శులుగా యెబు రాజు,శివరాం ప్రసాద్, ఎన్నికయ్యారు,ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ బాధ్యత లను అప్పగించిన జిల్లా నాయకత్వానికి,తోటి జర్నలిస్ట్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాగార్జునసాగర్ పరిధిలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి,వారి సంక్షేమానికి నిరంతరం అందుబాటులో ఉంటూ కమిటీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు,