పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – స్వర్ణ మానస సుమన్
నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమం
జనం న్యూస్- జూన్ 5- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ, పర్యావరణ వారోత్సవాలలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈరోజు (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, నందికొండ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ మానస సుమన్ మరియు కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు, మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు ప్రతి ఇంటిలో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని అలాగే ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన ప్రత్యేక రోజును ఎంపిక చేసుకుని ఆ రోజున ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని నందికొండ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు మాట్లాడుతూ చెట్లు మానవ జీవితానికి ఎంతో అవసరమని మొక్కలు ప్రాణవాయువును అందించడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, భూగర్భ జలాల సంరక్షణకు దోహదపడతాయని ఉష్ణోగ్రతలను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని పేర్కొన్నారు వర్షపాతం పెరగడానికి జీవవైవిద్య పరిరక్షణకు చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు భావితరాలకు స్వచ్ఛమైన హరిత వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.