అభివృద్ధిని అడ్డుకోవాలా? లేక భవిష్యత్తును ఆహ్వానించాలా ఊహలు ఎవరివి? వాస్తవాలు ఎవరివి

June 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 11 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా కోర్టు సముదాయం అనంతపురం గుట్టల వద్ద నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు వస్తాయని కొందరు చెబుతున్నారు. కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నేటి పరిస్థితులతో మాత్రమే కొలిస్తే దేశంలో ఏ నగరం ఏ సంస్థ ఏ మౌలిక సదుపాయం కూడా ఏర్పడేది కాదు.వాస్తవాలను చూద్దాం ఒకప్పుడు గద్వాల పట్టణం సుంకులమ్మ గుడి పరిసరాల్లోనే ఉండేది. నేడు హౌసింగ్ బోర్డ్ కొత్త కాలనీలు విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు పట్టణ విస్తరణకు నిదర్శనం 76 సంవత్సరాల్లో రెండున్నర కిలోమీటర్లు మాత్రమే విస్తరించింది అనే వాదన పూర్తిగా తప్పుదారి పట్టించేదే. పట్టణాభివృద్ధి సరళ రేఖలో జరగదు ఒక పెద్ద ప్రభుత్వ ప్రాజెక్టు, రింగ్ రోడ్డు విద్యాసంస్థ పరిశ్రమ కోర్టు సముదాయం వంటి ప్రాజెక్టులు అభివృద్ధిని వేగవంతం చేస్తాయి.ఒకప్పుడు పట్టణానికి దూరంగా ఉన్న కలెక్టరేట్‌లు యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు హైకోర్టులు నేడు నగరాల మధ్యలోనే ఉన్నాయి.భవిష్యత్ 50 నుండి 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తాయి. కేవలం నేటి ట్రాఫిక్ లేదా నేటి జనాభా ఆధారంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టవు.81 కోట్ల కోర్టు సముదాయం చిన్న విషయం కాదు జిల్లా కోర్టు సముదాయం సాధారణ భవనం కాదు. ఇది శాశ్వత న్యాయ వ్యవస్థ కేంద్రం భవిష్యత్తులో కొత్త కోర్టులు పార్కింగ్ న్యాయవాదుల ఛాంబర్లు లిటిగెంట్ సౌకర్యాలు రికార్డు భవనాలు భద్రతా వ్యవస్థలు వసతి గృహాలు ఏర్పడాలంటే విస్తారమైన భూమి అవసరం.పట్టణ మధ్యలో అలాంటి విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా ఉంటే ఎందుకు ఇప్పటివరకు ఎవరూ చూపించలేకపోతున్నారుప్రజల సౌకర్యం అంటే కేవలం దూరమానేడు పట్టణంలోనే ఉన్న కోర్టులకు కూడా చాలామంది గ్రామీణ ప్రజలు 30 నుండి 60 కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్నారు.అనంతపురం గుట్టల వరకు అదనంగా కొన్ని నిమిషాల ప్రయాణం ఉండవచ్చు. కానీ ప్రతిఫలంగా శాశ్వత విశాల ఆధునిక కోర్టు సముదాయం లభిస్తుంది.మంచి రోడ్లు, బస్సు సౌకర్యం ఆటోలు భవిష్యత్ రవాణా వ్యవస్థలతో ఈ సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు.రియల్ ఎస్టేట్ అనే ఆరోపణ ఎందుకు అభివృద్ధి జరిగే ప్రతి ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ కోణంలో చూడటం సరైంది కాదు.ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో హైకోర్టు ఆమోదంతో నిర్మించే కోర్టు సముదాయాన్ని వ్యక్తిగత వ్యాపారాలతో ముడిపెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే.అసలు ప్రశ్న ఇదే. 81 కోట్ల రూపాయలతో భవిష్యత్ తరాలకు సరిపోయే విశాల కోర్టు సముదాయం నిర్మించాలా లేక నేటి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాల కోసం మరోసారి ప్రాజెక్టును ఆలస్యం చేసి నిధులు కోల్పోవాలా మా అభిప్రాయం స్పష్టంకోర్టు ప్రజల కోసమే.ప్రజల భవిష్యత్తు కోసమే.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం అవసరం.అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, అభివృద్ధిని వేగవంతం చేయడం కాలానుగుణ బాధ్యత. గుట్టలో కోర్టు కాదు అంటున్నారుకానీ భవిష్యత్తును గుట్టల దగ్గరే ఆపేయాలా నేటి అసౌకర్యాన్ని మాత్రమే చూసి రేపటి తరాల అవకాశాలను త్యాగం చేయకూడదు.జిల్లా కోర్టు సముదాయం నిర్మాణం వెంటనే ప్రారంభించాలి గద్వాల జిల్లా అభివృద్ధికి ఇది చారిత్రాత్మక అడుగు.పూజారి శ్రీధర్ సత్యాస్ లా ఇన్విటేషన్ జర్నలిస్ట్

🌐 Select Language:
📰 ePaper