మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

June 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్, మే 11, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా ఆసుపత్రిని అయన సందర్శించారు, రెండున్నర ఏళ్ల తర్వాత మొదలైన నూతన ఆసుపత్రిని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper