నందలూరు రైల్వే సమస్య ల పై జి.ఎం కు వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నాయకులు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 13-06-26 నందలూరు రైల్వే స్టేషన్ సంబంధించిన పలు సమస్యలు,పై చమ్మర్తి జగన్మోహన్ రాజు, చూచన మేరకు రైల్వే జి. ఎం కు వినతి పత్రం, ఇచ్చి , సమస్యలు తెలియ జేసిన టీడీపీ నాయ కులు అలాగే ,మంటపంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు వినతి సౌత్ రైల్వే జీఎం సందీప్ మాథూర్‌ను కలిసిన టీడీపీ నాయకులు ఒంటిమిట్ట మండలంలోని మంటపం పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన వసతులను కల్పించాలని కోరుతూ టీడీపీ నాయకులు సౌత్ రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సందీప్ మాథూర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ మంటపం పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో రోజూ వందలాది మంది ప్రయాణికులు రాక పోకలు సాగిస్తున్నప్పటికీ, తగిన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా ప్రయాణికులకు విశ్రాంతి తీసుకునేందుకు వేచి ఉండే గదులు, షెల్టర్లు, తాగునీటి సదుపాయం, కూర్చునే బెంచీలు తదితర వసతులు కల్పిం చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రజల అవ సరాలను దృష్టిలో ఉంచుకొని మంటపంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందు బాటులోకి తీసుకురావాలని జీఎంను కోరినట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన రైల్వే అధికారులు సమస్య లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి నట్లు నాయకులు వెల్లడిం చారు.ఈ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్, ఒంటిమిట్ట జడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి, మండల టీడీపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి బొబ్బిలి రాయుడు,రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.