బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – నోముల భగత్
జనం న్యూస్- జూన్ 13- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, (ఎస్ఐఆర్) ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే బి ఎల్ ఏ ల బాధ్యతలు, విధులపై స్పష్టత తీసుకురావడం లక్ష్యంగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలలో విస్తృతంగా నిర్వహించి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు. బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరు చురుకుగా పనిచేసి ఓటరు జాబితాల సవరణ, పరిశీలన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.అదేవిధంగా, 2026 జూన్ 16న హాలియా పట్టణం లోని లక్ష్మి నర్సింహా గార్డెన్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోటి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ లు ముఖ్య అతిథులు గా హాజరుకానున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.