ప్రజా సంక్షేమ వేదిక పోస్టర్స్ విడుదల చేస్తున్న మంత్రి సీతక్క అధ్యక్షులు మడికొండ రఘుపతి
జనం న్యూస్ జూన్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ గురించి పబ్లిక్ కు అవగాహణ కల్పిస్తూ ప్రజా సంక్షేమ వేదిక ముద్రించిన పోస్టర్స్ ను తెలంగాణ పంచాయతీ రాజ్ స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రయాణం చేసే సమయం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే ప్రయాణ సమయం లో తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు అలాగే కారు లో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించాలని అన్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అన్నారు మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడని అన్నారు ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా ప్రయాణించాలని ప్రజలకు సూచించారు.రోడ్డు ప్రమాదాల నియంత్రణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ వేదిక సామాజిక సేవా సంస్థ బృందాన్ని ఈ సందర్భంగా సీతక్క అభినందించారుఈ కార్యక్రమం లో ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి నాయకులు మూలుగు చైర్ పర్సన్ చంద్రకళ తదితర శాఖల అధికారులు ప్రజా సంక్షేమ వేదిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు….