గినియార్‌పల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం

June 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్. 17. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం : విజయవంతం జహీరాబాద్ నియోజకవర్గం జర సంఘం మండలంలోని గినియార్‌పల్లి గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ జయశంకర్ విద్య ప్రాముఖ్యతను వివరించి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు హాజరై ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి బడిబాట కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి బాలబాలిక విద్యను అభ్యసించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కోకిల, లావణ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొని విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించి క్రమం తప్పకుండా హాజరు కావాలని అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు పాఠశాలల్లో చేరికలు పెరగనున్నాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

🌐 Select Language:
📰 ePaper