భగవంతుని భూమి, బహిరంగ వేలం

June 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ , 2026 జూన్ 20, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలోని, రామేశ్వర స్వామి, దేవాలయానికి చెందిన, వ్యవసాయ భూమి, సర్వే నెంబరు 123 లోని 10 ఎకరముల 14 గుంటలు మరియు 124 లోని 9ఎకరముల 11గుంటలు కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఇట్టి వ్యవసాయ భూమిని, కౌలుకు ఇచ్చుటకొరకు, తేదీ 22 జూన్ 2026 న, సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు,గ్రామం లోని హనుమాన్ మందిరం వద్ద, వేలం వేయబడునని, ఆసక్తి కలిగిన వారు, రూ. 5000/- రూపాయలు, చెల్లించి , బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని, ఆలయ కార్య నిర్వహణ అధికారి, శివ రుద్రప్ప తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper