ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి డా,, సాయి కృష్ణ
జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 0 నుంచి 5 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మండలం లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారి డాక్టర్. సాయికృష్ణ తెలియజేశారు ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తు ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.“పోలియో వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం ఉంది ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆయన అన్నారు. మండల వ్యాప్తంగా 3,500 మందికి పైగా చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. కార్యక్రమం కోసం అన్ని గ్రామాల్లోని పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో మొత్తం 21 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. మండల ప్రజలు సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు