నడిగడ్డ రైతు కడుపు మంట కంటే రేవంత్ రెడ్డి భజనే ముఖ్యమా సంపత్ కుమార్

June 27, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 27 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా కర్ణాటకకు ప్రశ్నలు లేవు హరీష్ రావుకే విమర్శలా ఇదేనా రేవంత్ రెడ్డి & కో టీమ్ వైఖరి హరీష్ రావు ని విమర్శించే ముందు నడిగడ్డ రైతుకు న్యాయం చేయండి మీ అక్రమ దోపిడీకి ఈ ప్రాంతపు వనరులు కావాలి – కానీ ఆర్ డి ౠ రైతుల బాధలు పట్టవా సంపతన్న బి ఆర్ యస్ జెండా ఎగరనివ్వం అనే మీ గుంపు మేస్త్రికి చెప్పండి – గులాబీ జెండాను గుండెల్లో ఎంత ఫదిలంగా దాచుకున్నారో నడిగడ్డ ప్రజలు బహుశా అందుకేనేమో మీ కాంగ్రెస్ వీళ్ళు ఈ అలంపూర్ ప్రజలపై కక్ష్య సాధిస్తున్నారా నడిగడ్డ రైతుల నీటి హక్కుల కోసం మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాసి ఆర్డీఎస్‌పై నెలకొన్న ఆందోళనలను స్పష్టంగా ప్రస్తావించారు కర్ణాటక ప్రభుత్వం ఎగువ ప్రాంతంలో చేపడుతున్న ప్రాజెక్టులు బ్యారేజీలు నీటి మళ్లింపు చర్యల వల్ల నడిగడ్డ రైతులకు నష్టం కలగొచ్చని హెచ్చరిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గట్టి అభ్యంతరం తెలపాలని కోరారు.కానీ ఆ లేఖలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హరీష్ రావు పైనే విమర్శలు చేయడం విచారకరం.సంపత్ కుమార్ ప్రశ్నించిన వారిని తప్పుపట్టడం సులభం కానీ నడిగడ్డ రైతుల తరఫున కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఎక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో కలిసి ఆల్మట్టి ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అలాంటి వేదికపై ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ఆందోళనను స్పష్టంగా ప్రస్తావించారా కర్ణాటక చేపడుతున్న చర్యలపై తెలంగాణ అభ్యంతరాన్ని బహిరంగంగా వెల్లడించారా నడిగడ్డ రైతులకు భరోసా ఇచ్చారా ఇవే ప్రశ్నలు రైతాంగం అడుగుతోంది నడిగడ్డ రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అండగా నిలవాల్సిన నాయకులు రాజకీయ విమర్శలతో సరిపెట్టుకోవడం బాధాకరం ఇంకో వైపు ఈ ప్రాంత సహజ వనరుల వినియోగం ఇసుక రవాణా ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాటికి సమాధానం చెప్పకుండా రైతుల నీటి హక్కులపై మాట్లాడిన వారినే లక్ష్యంగా చేసుకోవడం ప్రజలను మరింత ఆలోచింపజేస్తోంది నడిగడ్డ ప్రజలకు రాజకీయ ప్రసంగాలు అవసరం లేదు ఆర్డీఎస్‌కు నీళ్లు కావాలి.రైతుకు భరోసా కావాలి.తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి కర్ణాటక చర్యలపై అధికారికంగా గట్టి అభ్యంతరం తెలపాలి హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి రైతు బతుకుపై రాజకీయం కాదు రైతు హక్కుపై న్యాయం చేయాలి నడిగడ్డ నీటి హక్కుల విషయంలో రాజీ లేదు రైతు ప్రయోజనాల విషయంలో రాజీ లేదు మీ తుప్పత్రాల వీరేష్ బి ఆర్ ఎస్ వి

🌐 Select Language:
📰 ePaper