తెలుగు ప్రజలు ఎక్కడున్నా..వారికి అండగా కూటమి ప్రభుత్వం
జనం న్యూస్ జూలై 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) తెలంగాణ గడ్డపై మంత్రి వాసంశెట్టి సుభాష్ సేవా సంకల్పం… వేలాది మందికి భరోసాజాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు – ప్రజా దర్బార్తో సమస్యలకు పరిష్కారంప్రజా సేవలో మరో ముందడుగుహైదరాబాద్, జూలై 5:రాష్ట్ర సరిహద్దులు మారినా… ప్రజలపై ప్రభుత్వ బాధ్యత మారదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్లో నివాసముంటున్న తెలుగు ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో హైదరాబాద్లోని బిక్షపతి యాదవ్ కళ్యాణ మండపంలో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళా – ప్రజా దర్బార్ విశేష స్పందనతో విజయవంతమైంది.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, మాది ప్రజా ప్రభుత్వం… తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి కష్టసుఖాల్లో అండగా నిలవడం మా బాధ్యత. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ పాలనకు మూల సూత్రమని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు.ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, జాబ్ మేళా ద్వారా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. యువత ప్రతిభకు తగిన ఉద్యోగాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్లో హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, పరిపాలనా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని స్వయంగా ఆలకించి సంబంధిత అధికారులతో వెంటనే సమన్వయం చేసి పరిష్కార చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయి… ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించే కొత్త సుపరిపాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి సుభాష్ పేర్కొన్నారుఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ నివసించినా వారి అభ్యున్నతి, ఉపాధి, భద్రత, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం, ప్రజలకు చేరువైన పాలనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.మంత్రి సుభాష్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరు స్తున్నాయని, ప్రజల అవసరాలను గుర్తించి వారివద్దకే వెళ్లి పరిష్కారం చూపే నాయకత్వం ఆయనదని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, రాజేష్ అంగటి, రేవు శ్రీను, తెలంగాణ రాష్ట్ర టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాల్గొన్నారు.