ఎమ్మెల్యే టీఆర్ఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా నూతన వ్యవసాయ అధికారి
జనం న్యూస్ జులై 6,వికారాబాద్ జిల్లా (పరిగి నియోజక వర్గం ఇన్చార్జి) హైదరాబాద్లోని ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, నివాసంలో ఈరోజు వికారాబాద్ జిల్లా నూతన వ్యవసాయ అధికారి కవిత, పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ని పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధి,రైతులకు ప్రభుత్వ పథకాల అమలు, వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే నూతన వ్యవసాయ అధికారితో చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేలా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే, అన్నారు.