బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జులై 06-07-2026 భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి,నవభారత నిర్మాత ‘బాబు జగ్జీవన్ రామ్’ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు వారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వై.నరోత్తం గారు మాట్లాడుతూ సమాజంలో సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం,వారి అభ్యున్నతి కోసం,సామాజిక సమానత్వం కోసం అలు పెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త అని ఆయన జీవితాంతం మనందరికీ ఆదర్శం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,యం.మల్లేశం,హాసన్ పర్వానా,చెంగల్ జైపాల్, జైరాజ్,అబ్రహం మాదిగ,ధన్ రాజ్,ఉల్లాసం,చిన్న,మోహ న్,నిర్మల్,మైకేల్,పవన్ రాథో డ్,కె.మల్లేశం,తదితరులు పాల్గొన్నారు