12న ఆదర్శ్ నగర్ లో సంకీర్తన
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం జహీరాబాద్, జూలై 10: శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్, జహీరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 12న పట్టణంలోని ఆదర్శ్ నగర్ పార్క్ లో 215వ నగర సంకీర్తన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోజు ఉదయం 6.15 గంటలకు ప్రారంభమయ్యే సంకీర్తన కార్యక్రమంలో ప్రార్థన గీతం, శ్రీ కృష్ణ కీర్తనలు, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభీషణ్ ప్రభుజీ ద్వారా సత్సంగ ప్రవచనం, దాంతోపాటు జూలై 18న నిర్వహించతలపెట్టిన జగన్నాథ్ రథయాత్ర కు సంబంధించి ఏర్పాట్ల విషయమై ఆదర్శ్ నగర్ సభ్యులతో సమావేశం ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. భక్తులు సాంప్రదాయ వస్త్ర ధారణతో విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు.