మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ , జూలై 14, అచ్యుతాపురం: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అచ్యుతాపురంలోని అచ్యుత జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులపై జరిగే వేధింపులు, దౌర్జన్యాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, అధ్యాపకులకు పోలీసులు సూచించారు. ఎలాంటి నేరాలు జరిగినా మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో 100, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని వివరించారు.అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్ రావు, ఎస్‌ఐ సుధాకర్, డబ్ల్యూఎస్‌ఐ పోషణ మహిళల భద్రత, బాలల హక్కులు, ఫోక్సో, క్రైమ్, సోషల్ మీడియా, సైబర్ నేరాల నివారణపై సుమారు 100 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అచ్యుత కళాశాల కరెస్పాండెంట్ పల్లి శేషగిరిరావు, డైరెక్టర్ పల్లి అశోక్, ప్రిన్సిపాల్ రాజాన సత్యనారాయణ, ఎస్. నరసింహారావు, చిన్నారావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు