రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహనా కార్యక్రమం ఏ ఓ శ్రీకాంత్

May 13, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 14మే పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలోని నందగిరి రైతు వేదికలో రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త Dr. బి. శ్రీనివాస్ మాట్లాడుతూ వరి పంటలో తీసుకోవాల్సిన మెళుకువలను, డిమాండ్లో ఉన్న సన్న వరి రకాల సాగు పై,తక్కువ యూరియా వాడకం, పంటల మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నిర్దేశించిన పురుగు, తెగుళ్ల, కలుపు మందుల వాడకం లో, సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి, పచ్చిరొట్ట పంటల సాగు, నేల ఆరోగ్యం , వంటి వివిధ అంశాల పై రైతులకు అవగాహన కల్పించటం జరిగింది. అలాగే మండల వ్యవసాయ అధికారి ఓ.శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ వానకాలం నుండి యూరియా, యూరియా బుకింగ్ యాప్ ద్వార అదించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందగిరి గ్రామ సర్పంచ్ డి. రజిత-సురేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రవీందర్ , నందగిరి గ్రామ రైతులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper