దివ్యాంగుల నూతన డైరెక్టర్ కి ఘన స్వాగతం ఉదయ టీం అసోసియేషన్ సభ్యులు
జనం న్యూస్ 15 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఈరోజు మన ఉదయ్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దివ్యాంగుల సంక్షేమ శాఖ గౌరవనీయులైన డైరెక్టర్ ఎస్. సత్యనారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాఖ తరఫున సాదర స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే రాష్ట్రంలోని దివ్యాంగుల అత్యంత కీలకమైన సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాము దశాబ్ద కాలపు అన్యాయం: గత పదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ మరియు ఉపాధి కల్పన విషయంలో దివ్యాంగులకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని వారికి నిశితంగా వివరించాము ఉపాధిపై సీరియస్ యాక్షన్: ఇకపైన అయినా దివ్యాంగుల ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఖాళీలను త్వరగా భర్తీ చేసేలా శాఖ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరడం జరిగింది మన వినతిపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగుల హక్కుల రక్షణకు మరియు ఉపాధి కల్పనకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదరులారా మన హక్కుల సాధన కోసం ఉదయ్ అసోసియేషన్ గ్రౌండ్ లెవెల్ నుండి ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటుందిఈ కార్యక్రమంలో ఉదయ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. శ్రీనివాసులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి. వీరేష్ జాయింట్ సెక్రటరీ వి. ఆంజయ్య మహిళా విభాగం అధ్యక్షురాలు మణెమ్మ తదితరులు పాల్గొన్నారు