ప్రపంచ హరిత దినోత్సవంక్రెడాయి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆనందరావు
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం :ప్రపంచ హరిత దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గరిగుంట చెరువు పార్క్‌లో క్రెడాయి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణ రంగం పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణ రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతోందన్నారు. అమలాపురం పట్టణంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అనువైన ప్రాంతాల్లో ప్రభుత్వ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆముడా అధ్యక్షులు అల్లాడ స్వామి నాయుడు, పురపాలక సంఘ కమిషనర్ నిర్మల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు అధికార జయలక్ష్మి, క్రెడాయి అమలాపురం శాఖ అధ్యక్షులు ఎం.ఎన్.వి. ప్రసాద్ పాల్గొన్నారు.కార్యక్రమంలో క్రెడాయి సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, సుంకర నాయుడు, ముద్రగడ తాసు, చిక్కం సుబ్రహ్మణ్యం, ఎరుబండి నాని, తాడి నరసింహారావు, రేకపల్లి సోము, రవణం చిట్టి, బోనం సత్తిబాబు, అడపా శ్రీనివాస్, ఇదల సాయి, నూకల బులి నాయుడు, సుదా చిన్నా, చిక్కం కిట్టు, రవణం కాసు, సుబ్బారావు, కానిపూడి రమేష్, కాయల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.