తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
జనం న్యూస్ 27 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్, మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది ఈరోజు సాయంత్రం లేదా రేపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అయినా పాలమూరు రైతుకు నీళ్లు అందించకుండా ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుకు వెళ్లేలా చేయడానికే పంపులను ఆన్ చేయడం లేదు ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది వరదొచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయకుండా కిందికి జార విడుస్తుంది. తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమా ఈ ప్రభుత్వానికి తక్షణమే భీమా-1లోని భూత్‌పూర్ (1.3 టీఎంసీ) సంగంబండ (3.3 టీఎంసీ) భీమా-2లోని శంకర సముద్రం (1.8 టీఎంసీ), రంగసముద్రం (1.9 టీఎంసీ), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి (1.2 టీఎంసీ), ర్యాలంపాడు (4 టీఎంసీ) అలాగే కోయిల్‌సాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్లను నింపేందుకు వెంటనే మోటార్లను ప్రారంభించాలి అలాగే జూరాల ఎడమ కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.