పుట్టబోయే బిడ్డకు తల్లి పాలు శ్రేష్టం గ్రామ సర్పంచ్ శివాజీ*

August 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 6 శాయంపేట మండల రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూకిడి శివాజీ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు తెలియజేస్తూ పుట్టిన పిల్లలకు డబ్బా పాలను కాకుండా తల్లిపాలనే తాగించడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు.బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలనే తాగించాలని అన్నారు ఏడవ నెల నుండి అంగన్వాడి కేంద్రాలలో తల్లులు తమ పేరు నమోదు చేసుకుని ప్రతి నెల తల్లులకు కోడిగుడ్లు పాలు బాలామృతం ఇస్తారని ప్రచారం చేస్తూ గ్రామంలో తెలిపారు….. ఈ కార్యక్రమాలలో హెఏం రాజా యుగేందర్ గ్రామ సర్పంచ్ కూకిడి శివాజీ, ఉప సర్పంచ్ కొత్తగట్టు సాయి కృష్ణ, 8 వ వార్డు మెంబర్ వినయ్ స్వర్ణ,అంగన్వాడీ టీచర్స్ దౌడు మధుర, బలెరావు రేవతి,మామిడి సరిత, ఆశలు పెంబర్తి నీల, రమాదేవి,పిల్లలు,బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు…..

🌐 Select Language:
📰 ePaper