జోగులాంబ గద్వాల జిల్లా 22 మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన వైష్ణవి స్మార్ట్ స్కూల్
జనం న్యూస్ 14 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అకాడమిక్ ఇయర్ 2024-2025 లో పాస్ అయినారు కానీ ఇంతవరకు మెమోలు ఇవ్వకుండా ఒక సంవత్సరం ఆ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు.మా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వెలిబుచ్చుతున్న తల్లిదండ్రులు మొత్తం ఫీజులు కట్టినం అయినా కూడా మాకు మెమోలు ఇవ్వకుండా తీవ్రమైన మోసం చేశారు విద్యార్థి తం యాకూబ్ భాష ఆవేదన విద్యార్థులు నవాజ్ చరణ్ యశ్వంత్ తదితరులు 22 మంది.22 మంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన ఆ స్కూల్ పైన తక్షణమే చర్యలు తీసుకొని యజమాని పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే రద్దు చేయాలి అని జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తిజూన్ 3, 2026 న తల్లిదండ్రులు ప్రజావాణిలో డీఈఓ కి ఫిర్యాదు చేసిన కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం ఇది దుర్మార్గం ఆ స్కూల్ యజమాన్యం పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అధికారులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాంజిల్లాలో అధికారులు ప్రైవేట్ విద్యపై ఇంత నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారా దీని వెనక ఏమైనా జరిగిందా అనే అనుమానాలు కూడా తల్లిదండ్రులు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు