జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి

August 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 25 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ స్కిల్ యూనివర్సిటీలో విలీనం వద్దుఇంటర్మీడియట్ బోర్డు తరహాలో పాలిటెక్నిక్‌కు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి: సింధనూరుఉప్పరి గంగాధర్ హైదరాబాద్ పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి గంగాధర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రత్యేకతను కాపాడుతూ విద్యార్థుల భవిష్యత్తు విద్యా మరియు ఉద్యోగ అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీల పరిధిలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయడం వల్ల విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు స్కాలర్‌షిప్‌లు రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు మరియు ఇతర విద్యా సదుపాయాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సింధనూరు ఉప్పరి గంగాధర్ పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయకుండా పాత విధానంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే ఇంటర్మీడియట్ బోర్డు తరహాలో పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని పరిధిలో పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు జీవో97 రద్దు చేసే వరకు విద్యార్థులకు అండగా ఉంటాం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమస్యపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తుందని సింధనూరు ఉప్పరి గంగాధర్ స్పష్టం చేశారు. జీవో 97 రద్దు చేసేంత వరకు విద్యార్థుల పక్షాన పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ప్రభుత్వం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. జోవో 97 రద్దు చేసే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటుంది అని సింధనూరు ఉప్పరి గంగాధర్ అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జీఓ 97ను రద్దు చేయాలని లేనిపక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణను ప్రకటించి విద్యార్థులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

🌐 Select Language:
📰 ePaper