మిలాద్-ఎ-ఉన్-నబీ పండగ సందర్భంగా జుక్కల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం….
జుక్కల్ ఆగస్టు 25 జనం న్యూస్ మిలాద్–ఎ- ఉన్- నబి పండగ సందర్భంగా మంగళవారం రోజు జుక్కల్ పోలీస్ స్టేషన్ లో సిఐ రవికుమార్ ఎస్సై మురళి ఆధ్వర్యంలో జుక్కల్ ముస్లిం సోదరులు, నాయకులతో శాంతి కమిటీ సమావేశంఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ ఈ పండగను మత సామరస్యంగా మంచి వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయానికి లోనూ కాకుండా పండగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.మైనార్టీ సంఘం అధ్యక్షుడు ఎండి షాదుల్ మాట్లాడుతూశాంతియుతంగా జరిగేలా చూస్తామని సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్ మైనార్టీ సంఘం అధ్యక్షులు MD షాదుల, మిలాద్ సంఘం Sd షకీల్, సైమ్ ఖాన్, జునైద్, ఎస్టీ కరీం, SK ఇర్ఫాన్, మెహబూబ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.