ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

May 20, 2026 | తెలంగాణ

రక్తదానం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

జనం న్యూస్, మే 20,అచ్యుతాపురం: అచ్యుతాపురం ఎస్టీబిఎల్ సినిమా థియేటర్ లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు నాలుగవ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలోస్వచ్ఛందంగా 80 మంది అభిమానులు రక్తదానం చేసినట్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏరిపల్లి ముత్యాలు మాట్లాడుతూ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయబోతున్నామని అదేవిధంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి దాతలకు అత్యవసర సమయంలో బ్లడ్ అవసరమైన తమ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులను సంప్రదించినట్లయితే 24 గంటల్లో వారికి బ్లడ్ అందేటట్లుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి ఎస్టీబియల్ మేనేజర్ కొండబాబు కి మరియు యాజమాన్యానికి తమ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ చిన్న,కోశాధికారి ఉదయభాస్కర్ మరియు ఆర్గనైజర్ వై అనిల్ యాదవ్ తదితర అభిమానులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper