మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో భాగంగా నందలూరు ఉర్దూ పాఠశాలలో వ్యాసరచన పోటీలు

August 27, 2026 | వైరల్ వార్తలు

సబ్ టైటిల్ :-విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా కార్యదర్శి సయ్యద్ అమీర్ ​నందలూరుమండలం లోపవిత్ర మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా నందలూరులోని ఉర్దూ పాఠశాలలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దివ్యజీవితం, ఆయన అందించిన శాంతి సందేశాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఘనంగా నిర్వహించారు. మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది.​ఈ వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు పెద్ద సంఖ్యలోవిద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రవక్త జీవిత విశేషాలు,ఆయనచూపిన ప్రేమ, కరుణ, మానవత్వ మార్గాలపై విద్యార్థులు తమ వ్యాసాల ద్వారా ప్రతిభను కన బరిచారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను విజేతలకు అందజేశారు.​ఈ సందర్భంగా మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ మాట్లాడుతూ, హజ్రత్ మహ మ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చూపిన శాంతి, సోదర భావం, కరుణ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ప్రవక్త ఉత్తమ గుణాలను, ఆదర్శాలను తమ జీవితంలో అలవరచుకోవాలని, చదువుతో పాటు నైతిక విలువలను పెంపొం దించుకోవాలని పిలుపునిచ్చారు.​ అనంతరం హైదర్ సాహెబ్ మాట్లాడుతూ, విద్యార్థులలో దాగిన ప్రతిభను వెలికితీసేందు కు ఇటువంటి పోటీలుఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రవక్త జన్మదిన సందర్భంగా పిల్లలకు ఆయన సందేశాన్ని వివరించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయ మని పేర్కొన్నారు.​అలాగే పఠాన్ మెహర్ ఖాన్ మాట్లాడుతూ, మానవత్వానికి, సమత్వానికి ప్రవక్త జీవితమే గొప్పఉదాహరణ అని తెలిపారు. నేటి యువత, విద్యార్థులు ఆయన మార్గాన్ని అనుసరిస్తూ సమాజశ్రేయస్సు కు,పురోగతికి తోడ్పడాలని కోరారు.​ఈ వేడుకల్లో వరల్డ్ హ్యూమన్ రైట్స్ స్టేట్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, పాఠశాల కరస్పాండెంట్,బబీత అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper