మద్నూర్: SIR ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు మద్నూర్ మండలంలో విస్తృత కార్యక్రమాలు చేపట్టినట్లు

August 27, 2026 | వైరల్ వార్తలు

మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ తెలిపారు.

SIR పై గ్రామ సభలు – నోటీసులపై విచారణ

మద్నూర్ ఆగస్టు 27 జనం న్యూస్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR లో భాగంగా మద్నూర్ మండల పరిధిలోని 24 గ్రామాలలో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన గురువారం వెల్లడించారు.ఈ గ్రామ సభల్లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను చదివి వినిపించడంతో పాటు, మరణించినవారు, నివాసం మారినవారు, డబుల్ ఎంట్రీలు, గైర్హాజరైన ఓటర్ల వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను సేకరించినట్లు తెలిపారు.SIR ప్రక్రియలో గుర్తించిన తప్పులకు సంబంధించి సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయడం జరిగింది. వాటిపై ఈ రోజు అనగా గురువారం పెద్ద తడ్గూర్ మరియు సుల్తాన్ పేట్ గ్రామాలలో విచారణ నిర్వహించినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.ఈ విచారణ కార్యక్రమాన్ని అసిస్టెంట్ ఎన్నికల నమోదు అధికారి మరియు తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ సమక్షంలో చేపట్టారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్ల వాంగ్మూలాలను పరిశీలించి, తగిన ఆధారాలతో సవరణలు చేసే ప్రక్రియను చేపట్టారు.ఈ కార్యక్రమంలో BLO లు, BLO సూపర్వైజర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.సరైన ఓటర్ జాబితా కోసం ప్రజలు గ్రామాలలో నిర్వహించే విచారణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ కోరారు.

🌐 Select Language:
📰 ePaper