వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ

August 27, 2026 | వైరల్ వార్తలు

“పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు” నినాదంతో 15వ వార్డులో అవగాహన ర్యాలీ

జనం న్యూస్, ఆగస్టు 27, జగిత్యాల జిల్లా : మెట్‌పల్లి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్‌పల్లి పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ లింబాద్రి సహకారంతో, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు.పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు” అనే నినాదంతో వార్డులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి ఇంటింటికీ వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అనూష రాకేష్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని చిన్నారుల మాదిరిగా సంరక్షించాలని కోరారు. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రజలందరూ మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.చెట్ల పెంపకంతో స్వచ్ఛమైన గాలి, మెరుగైన వాతావరణం లభించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను స్థానికులు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ విష్ణు, వార్డు ఆఫీసర్ జల, సూపర్‌వైజర్ రఘు, ఆర్‌పీ సరిత, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper