ప్రగతి సింగారం గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు
జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు సీఐ సుధాకర్ రెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని ప్రగతి సింగారం చెందిన బోనెపల్లి రఘుపతి రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల కోసం సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జక్కుల పరమేశ్వర్ సమక్షంలో సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్ నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలి అని సిఐ సుధాకర్ రెడ్డి తెలియజేశారు…