జనగణన ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల తహరాపూర్ ప్రగతి సింగారం గ్రామంలో కొనసాగుతున్న జనగణనను పరీశీలించిన తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ జనగణనకు ప్రజలు సహకరించి అధికారులకు కచ్చితమైన సమాచారం అందించాలని కోరారు ఈ సందర్భంగా సర్వే సిబ్బంది వివరాలను ఈ విధంగా నమోదు చేస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు సమాచార సేకరణలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు జనగణన ప్రక్రియ అత్యంత కీలకమైన దాని ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో జిపిఓలు సత్యం యాదగిరి పాల్గొన్నారు…