తుంగభద్ర నదిలో కొట్టుకొచ్చిన మొసలి నాగలాదిన్నె బ్రిడ్జి వద్ద కలకలం

September 3, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 03 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుతుంగభద్ర నదిలో భారీగా వస్తున్న నీటి ప్రవాహానికి ఓ మొసలి కొట్టుకొచ్చింది.తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నాగలాదిన్నె బ్రిడ్జి సమీపంలో మొసలి కనిపించడంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.నదిలో నుంచి కొట్టుకొచ్చిన మొసలి బ్రిడ్జి సమీప ప్రాంతంలోకి చేరుకోవడంతో అక్కడ ఉన్న రైతులు గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. మొసలిని గమనించిన స్థానికులు వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. దీంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.కొంతసేపు తప్పించుకునేందుకు మొసలి ప్రయత్నించినప్పటికీ.. రైతులు, గ్రామస్థులు సమన్వయంతో వ్యవహరించి చివరకు దాన్ని బంధించారు. మొసలి పట్టుబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే తుంగభద్ర నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో.. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మరింత చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నదికి సమీపంలో వ్యవసాయ పనులు చేసే రైతులు, పశువులను మేపేందుకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.నదిలో నీటి ప్రవాహం పెరిగిన సమయంలో మొసళ్లు, ఇతర వన్యప్రాణులు ప్రవాహంతో పాటు జనావాసాల వైపు వచ్చే అవకాశం ఉండటంతో.. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.మరోవైపు పట్టుబడిన మొసలిని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు స్థానికులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.తుంగభద్ర నదిలో కొట్టుకొచ్చిన మొసలి.. నాగలాదిన్నె బ్రిడ్జి వద్ద ప్రత్యక్షమై స్థానికులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే రైతులు, గ్రామస్థులు ధైర్యంగా వ్యవహరించి మొసలిని బంధించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

🌐 Select Language:
📰 ePaper