వివేకానంద లో కృష్ణాష్టమి వేడుకలు.

September 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్:3 సెప్టెంబర్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయములో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, పూలతో అందంగా అలంకరించారు. చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా దేవి పాత్రల వలే సాంప్రదాయ దుస్తులలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. కృష్ణుడి లీలలపై విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటకాలు అలరించాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఉట్టి కొట్టే పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకే ఇటువంటి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితం నుండి విద్యార్థులు క్రమశిక్షణ, సత్యం, స్నేహభావం వంటి గుణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయినిలు రత్నమాల, భాగ్యమ్మ, కృష్ణవేణి, ఫిర్దోజ్, మానుష, అరుణ పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper